Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : నక్కపల్లి మండలం ,వెదుళ్ల పాలెం లో జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి. ఇద్దరికి తీవ్ర గాయాలు. విశాఖ నుండి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు టైర్ పంచర్ కావడంతో కారు డివైడర్ దాటి తుని నుండి విశాఖ వైపు వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
Reporter
Rapid TV