Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ జిల్లాలోని 24 పోలింగు కేంద్రాల వద్ద సుమారు 300 మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టిన పోలీసుశాఖ. భద్రత ఏర్పాట్లును నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత డిఎస్పీ లను, ఇతర అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఫిబ్రవరి 27 న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన 24 పోలింగు కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ ప్రకటన ద్వారా తెలిపారు.
Admin
Rapid TV