Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం అరకలోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం బ్యాంకుల జాతీయకరణ దినోత్సవం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ 1969 వ సంవత్సరం జులై 19 న బ్యాంకుల జాతీయకరణ జరిగిందన్నారు. దీని కారణంగానే బ్యాంకుల సేవలు పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకుల సేవలు ద్వారా అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందగలిగారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రిన్సిపల్ పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ నగదును సురక్షతంగా పొందు పరుచుకునేందుకు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని అన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను అపరిచితులకు తెలియకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కామర్స్ అధ్యాపకులు కే బాలరాజు, ఎస్ అన్నపూర్ణ, జి సంధ్య , ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV