Saturday, 12 September 2026 02:02:42 AM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అక్టోబర్ 4 నుండి ఏ ఎల్ పురంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు... రూరల్ సీఐ రేవతమ్మ

Date : 17 September 2025 09:55 PM Views : 314

Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : అక్టోబర్ 4 నుండి మూడు రోజులపాటు గొలుగొండ మండలం ఏ ఎల్ పురం జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం రూరల్ సీఐ శ్రీమతి ఎల్ రేవతమ్మ తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం ఆమె ఏ ఎల్ పురం హైస్కూల్ ను సందర్శించారు. క్రీడాకారులకు వసతి, త్రాగునీరు, ఇతర సదుపాయాలపై ఉపాధ్యాయులతోనూ, స్కూల్ కమిటీ సభ్యులతోను చర్చించారు. ఈ సందర్భంగా రేవతమ్మ మాట్లాడుతూ, వచ్చేనెల 4 నుండి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ స్పీకర్, జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి హాజరవుతారని తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన గడ్డమీద ఈ పోటీలు జరగడం స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి 13 జిల్లాలలో ఒక్కో జిల్లా నుండి రెండేసి టీములు ( బాలురు బాలికలు) పాల్గొంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా విజయవంతం చేసి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎస్సై పి రామారావు, నాతవరం ఎస్సై వై తారకేశ్వరరావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లగుడు రాజు, ప్రధానోపాధ్యాయులు కృష్ణ ప్రసాద్, పి డి నర్సింగరావు, జి మాధవి, ఉపాధ్యాయులు లోచల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: