Tuesday, 28 July 2026 11:40:00 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

దివంగత లాలం సూరిబాబు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం... ఇటువంటి కార్యక్రమం స్ఫూర్తిదాయకం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Date : 12 May 2025 08:04 PM Views : 173

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో టిడిపి సీనియర్ నాయకుడు స్వర్గీయ లాలం సూరిబాబు ప్రధమ వర్ధంతిని పురస్కరించుకొని, 1వ మరియు 2వ వార్డుల టిడిపి ఇంచార్జ్‌గానూ, తెలుగు యువత అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్న లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 80 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పుట్టినరోజులు, మరియు ఇతర కార్యక్రమాలకు అనవసర ఖర్చులు చేయకుండా, ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని కాపాడే అవకాశముంటుందన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన బాధ్యతన్నారు. లాలం మురళీకృష్ణ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఒకే వార్డులో 80 మంది యువకులు పాల్గొనడం అభినందనీయమని స్పీకర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతకాయల రాజేష్, డబ్బేరు శ్రీకాంత్, నాయకులు, యువత పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :