Sunday, 13 September 2026 10:50:46 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

వేలకు రాని అనకాపల్లి డిపో ఆర్ టి సి బస్సులు

Date : 03 September 2025 10:59 PM Views : 416

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి/అనకాపల్లి/ రావికమతం : అనకాపల్లి జిల్లా కేంద్రమైన ఆర్టీసీ కాంప్లెక్స్లోలో ఆర్టీ సి బస్సులు వేలకు రాకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.20 కి అనకాపల్లి వయా తట్టబంధ రావికమతం బస్సు వెళ్లిన తరువాత రాత్రి 10.30. వరకు బస్సు రాకపోవడంతో సుమారు 80 మంది ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆరున్నర నుంచి పదిన్నర వరకు పడిగాపులు కాశారు. బస్సు రాకపోవడంతో ఆగ్రహం చెందిన కొంతమంది ప్రయాణికులు కంట్రోలర్ ను ప్రశ్నించగా డిపో మేనేజర్ బస్సులు చోడవరం వైపు నడపమన్నారని తెలిపారు. కొంతమంది ప్రయాణికులు సమయానికి రావలసిన బస్సు రాత్రి 10:30 వరకు రాకపోతే, రాత్రి సమయంలో ఎప్పుడు ఇంటి కి చేరుకుంటామని బస్సులు దిగి చీకట్లో మా గ్రామాలకు ఏ విధంగా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో బుచ్చయ్యపేట రావికమతం మండలాలకు చెందిన ప్రయాణికులు మాడుగుల మండలానికి చెందిన కొన్ని గ్రామాల ప్రయాణికులు అనకాపల్లి విశాఖపట్నం వెళ్లాలంటే రావికమతం నుంచే బస్సు ప్రయాణం చేస్తున్నారని దానికి అనుగుణంగా ఆర్టిసి బస్సులు నడకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :