Rapid TV - Andhra Pradesh / Anakapally : రావికమతం రాపిడ్ టివి : సిఐటియు మండల కన్వీనర్ వజ్రపు సత్యవతి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు రాష్ట్ర ధర్నా, గోడపత్రికను మంగళవారం విడుదల చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మికుల బతుకులు వీధిని పడ్డాయని వారి జీవనోపాధికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రకటించినప్పటికి అవి ఆటో రిపేర్ కి సరిపోవని కావునా రూ 30 వేలు ప్రకటించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డుఏర్పాటు చేయాలని పెంచిన టాక్స్లు పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చలో విజయవాడ 18వ తేదీన విజయవాడలో తలపెట్టిన మహాధర్నా కు కార్మికులందరూ హాజరుకావాలని గోడ పత్రిక ద్వారా తెలియజేస్తున్నట్లు సిపిఐ కన్వీనర్ సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెంటారావు నాయుడు సతీష్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV