Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రేగం ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్సీపీ అవిర్భావ దినోత్సవం రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభం అరకులోయ లో మంగళవారం వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ అరకు అసెంబ్లీ సమన్వయకర్త రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా రేగం మత్స్య లింగం అలాగే అరకులోయ నియోజకవర్గం చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు . అక్కడ నుండి స్థానిక ఏరియా ఆసుపత్రికి చేరుకొని అక్కడ రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. అనంతరం అరకలోయ లో ప్రధాన రహదారిలో నూతనంగా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ను ఆ పార్టీ అరుకు అసెంబ్లీ పరిశీలకులు శోభ హైమావతి దేవి చేతుల మీదగా ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా రేగం మత్స్యలింగం మాట్లాడుతూ జన హృదయ నేత, పేదల పెన్నిధి, సంక్షేమ రథసారధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గడిచిన 13 ఏళ్లలో ఎన్నో సవాలను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలును అమలు చేయడంతో పాటు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇలాంటి ప్రజా పరిపాలన కొనసాగాలంటే తిరిగి రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకులోయ అసెంబ్లీ వైఎస్సార్సీపీ పరిశీలకులు శోభా హైమావతి మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో రానున్న ఎన్నికలలో ఐకమత్యంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మండల జడ్పిటిసి శెట్టి రోషిణి, ఎంపీపీ రంజపల్లి ఉషారాణి, అరకులోయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కిల్లో రాజా రమేష్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ శోభా సోమేశ్వరి, మండల పార్టీ అధ్యక్షుడు లోకోయి లక్ష్మణ్ కుమార్, కార్తికో అరుణకుమారి, పద్మాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టెలి సుస్మిత, సుక్ర మరియు వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ ప్రభుత్వ నామినేట్ హోదాలో ఉన్న పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు వైఎస్సార్సీపీ స్టేట్, జిల్లా, మండల అన్నీ విభాగాల ప్రతినిధులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Rapid TV