Tuesday, 28 July 2026 10:05:00 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

డీసీఎంఎస్ స్థలాన్ని కాపాడాలి:: దాడి రత్నాకర్

Date : 07 February 2026 04:33 PM Views : 322

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి :: డీసీఎంఎస్ ఆవరణలో అనధికారికంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను ఆపి, చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పట్టణ నడిబొడ్డులో ఉన్న డీసీఎంఎస్ ఎకరా 60 సెంట్లు ప్రభుత్వ స్థలంలో మరియు జీవీఎంసీ జోనల్ కార్యాలయం కంపోస్ట్ యాడ్ ఉన్న స్థలంలో 9 అంతస్తుల భవనాన్ని నిర్మించి అందులో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి డిసిఎంఎస్ కు ఇటువంటి పెట్టుబడి లేకుండా నెలవారి ఆదాయం డీసీఎంఎస్ కు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో డీసీఎంఎస్ స్థలాన్ని బంకుకు అనధికారికంగా కేటాయించడం జరిగిందని అన్నారు. అప్పట్లో దాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బంకు నిర్మాణానికి కాకుండా ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉపయోగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో బంకు నిర్మాణం జరిగినట్టయితే ఉడా కాలనీ, రావుగోపాలరావు కళాక్షేత్రం, ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే వివిధ సాంస్కృతి కార్యక్రమాలు గాని, సీఎం మీటింగులు గాని, అనకాపల్లి ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు గాని నిర్వహించరాదనే నియమం ఉన్నదని అన్నారు. ఈ స్థలాన్ని బంకు కోసం 33 సంవత్సరాలు నెలకు 50 వేల చొప్పున చెల్లించే విధంగా లీజుకు ఇవ్వబడిందని అన్నారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని ఇన్ని సంవత్సరాలు లీజు కి ఇవ్వడం అంటే కబ్జాకు ప్రోత్సహించడం లాంటిదేనని అన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బంకు నిర్మాణం జరగడం మంచిది కాదు అనే ఉద్దేశంతో విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గారికి లేఖ రాసి ఎంపీ నిధులు, సిఎస్ఆర్ నిధులతో భవన సముదాయాలు నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తామని చెప్పడంతో బంకు నిర్మాణం నిలిపివేయడం జరిగిందని తెలియజేశారు. బంకు నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది ఎవరో తెలుసుకుంటామని మరియు కాంట్రాక్టర్ ను అడిగితే ఎక్కడో ఉన్నానని ఇప్పుడు రావడం కుదరదని చెప్తున్నాడని అన్నారు. లారీ ఇసుక మరియు జెసిబి లతో రాత్రి పూట అనధికారికంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్ ముసుగులో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా దొంగ చాటుగా రాత్రిపూట నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విధంగా జరిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, దీని ఆపడానికి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ నిధులతోనే ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏరియా ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: