Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర హోంశాఖమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో భాగంగా అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను ఆయన కార్యాలయంలో కలిసారు. కొణతాల రామకృష్ణ కు హోంమంత్రి అనిత పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మిమ్మల్ని చూస్తూ పెరిగానని, మీ ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని అనిత అన్నారు. అనంతరం హోం మంత్రి వంగలపూడి అనిత ను సాలువా కప్పి మెమొంటో అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన కొణతాల రామకృష్ణ. అనంతరం ఎంపీ సీఎం రమేష్ ను కూడా మర్యాదపూర్వకంగా కలవడానికి ఆయన కార్యాలయం నకు మంత్రి అనిత చేరుకున్నారు. అనంతరం అనకాపల్లి గుండాల వీధిలో గల ఆర్వో కార్యాలయంలో అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారులతో సమావేశంలో హోంమంత్రి అనిత పాల్గొంటారు.
Admin
Rapid TV