Rapid TV - Andhra Pradesh / Anakapally : ఘనంగా శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకర్రావు జయంతి వేడుకలు పేద ప్రజల కంటి వెలుగు శంకర్ ఫౌండేషన్ అధినేత ఆత్మకూరి శంకర్రావు అని ఆయన కుమారుడు ట్రస్టి ఆత్మకూరి కృష్ణ కుమార్ అన్నారు. సెప్టెంబర్ 2 సోమవారం శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆత్మకూరి శంకర్రావు జయంతి వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక శంకర్ ఫౌండేషన్ లో ఏర్పాటుచేసిన శంకర్రావు జయంతి వేడుకలలో శంకర్ ఫౌండేషన్ జిఎం కె. రాధాకృష్ణన్ (అడ్మిన్ & ఆపరేషన్), డిప్యూటీ జనరల్ మేనేజర్ కె బంగార్రాజు మరియు ఫౌండేషన్ డాక్టర్లు మరియు సిబ్బంది తో కలిపి ఆత్మకూరి కృష్ణ కుమార్ శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శంకర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఆత్మకూరు శంకరరావు కుమారుడు ఆత్మకూరి కృష్ణ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి చూపు ప్రసాదించడమే నాన్నగారి ఆశయమని, అందుకే శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారని ఆయన అడుగుజాడల్లో నేను నడవడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఒక చిన్న కంటి ఆసుపత్రి గా ఏర్పాటు అయిన ఈ ఫౌండేషన్ నేడు కంటికి సంబంధించిన అన్ని రకముల చికిత్సలు చేసే మరియు కంటి డాక్టర్లను తయారు చేసే ఇనిస్ట్యూట్ గా అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ సందర్భంగా శంకర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను వివరించారు. శంకర్ ఫౌండేషన్ ఇంత అభివృద్ధి కావడానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు నవీన్ మఖేజ ఎండి సీఈవో సౌత్ ఆసియా ఎల్పిజి కంపెనీ, అతుల్ కుమార్ శ్రీ వాస్తవ జనరల్ మేనేజర్ ఎల్ అండ్ టి, ఎల్ ఎస్ రావు చీఫ్ జనరల్ మేనేజర్ గెయిల్, ఎస్ వి ఎస్ ఎస్ ఎన్ రాజు ఐనాక్స్, ఎన్ వెంకట్రావు ఎం డి నెక్కంటి సీ ఫుడ్స్, డాక్టర్ రత్నం రామ్ మనోహర్ సైంటిస్ట్, కేశవ మజ్జి బాజిలై పౌండేషన్ వీరిని ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో 4,52,240 లక్షల కంటి శస్త్ర చికిత్సలను చేసి ఘనమైన కీర్తిని సాధించిందని అన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించడంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు విజన్ సెంటర్స్ ప్రతినిధులను ఆయన సిబ్బంది కలిపి ప్రత్యేకంగా సన్మానించారు. సంస్థ జనరల్ మేనేజర్ కె రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఈ శంకర్ ఫౌండేషన్ పై నమ్మకం ఉంచి పేదలకు సేవ చేయడంలో నిబద్దతను ప్రదర్శించి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రవీంద్ర, ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ శిరీష, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సువర్ణ, ఆస్పత్రిలో పేషెంట్ కు చేస్తున్న అత్యాధునికమైన వైద్య సదుపాయాలను వివరించారు. అనంతరం అనకాపల్లి విజిన్ సెంటర్ రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి ప్రతినిధి పూసర్ల రాజా, ట్రస్టీ ఆత్మకూరి కృష్ణకుమార్ మరియు జిఎం కే రాధాకృష్ణ లను శాలువా లతో ఘనంగా సత్కరించారు. శంకర్ ఫౌండేషన్ సంస్థ డీజీఎం వి రమేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ అప్పలరాజు, డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగారు రాజు, డీజిఎం వేణుగోపాల్, ఏజీఎం కనకరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు
Admin
Rapid TV