Rapid TV - Andhra Pradesh / Anakapally : వాసవి వనిత క్లబ్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ కార్యక్రమం శుక్రవారం అనకాపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రామచంద్రన్ పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు వివిధ సేవా కార్యక్రమాల్లో నిర్వహించారు. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుద్ధుడి విగ్రహం ప్రారంభోత్సవం, అనకాపల్లి మల్లవరపు వారి వీధిలో ఉన్న వాసవి బాలవిహార్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనకాపల్లి పట్టణం నర్సింగరావుపేట లో ఉన్న దుర్గ సాయి గణపతి దేవాలయంలో గుడి గేటుకు 25 వేల రూపాయలను ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 70మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. వీటితో పాటుగా పేదవారికి గొడుగులు, బియ్యం, దుప్పట్లు, తువాళ్ళు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనకాపల్లి వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ జంగాల ఫణి, సెక్రటరీ జి సువర్ణ, ట్రెజరర్ డి.సునీత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర రవి చంద్రన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె శేషగిరిరావు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వూడా త్రినాధరావు, ఇంటర్నేషనల్ ఎడిషనల్ ట్రెజరర్ శ్రీనాథ్ శీను, డిస్ట్రిక్ట్ గవర్నర్ వై నర్సింగరావు, క్యాబినెట్ సెక్రటరీ పీవీ స్వామి, క్యాబినెట్ ట్రెజరర్ కే పూర్ణిమ, వైస్ గవర్నర్2 ఎస్ సోమరాజు, వైస్ గవర్నర్1 ఎస్ వి మాధవ, రీజియన్ చైర్ పర్సన్ రామలింగస్వామి, రీజియన్ సెక్రటరీ వి వెంకటరాజు, జోన్ చైర్ పర్సన్ జి దేవి, మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Rapid TV