Saturday, 13 June 2026 02:36:38 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

డ్రగ్స్ కి వ్యతిరేకంగా అనకాపల్లిలో ర్యాలీ

ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ

Date : 26 June 2024 01:05 PM Views : 418

Rapid TV - Andhra Pradesh / Anakapally : అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అనకాపల్లిలో రింగ్ రోడ్ జంక్షన్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, ఎస్పీ కేవీ మురళీకృష్ణ పాల్గొనీ జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ సందర్భంగా అనకాపల్లిలో ఈ ర్యాలీ పోలీసు సహకారంతో నిర్వహించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గా అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే వంగలపూడి అనిత మేడం గారు ఉన్నారని మంత్రి గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై వందరోజుల రాకెట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కళాశాల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు, పట్టణాల్లో ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారని జిల్లా కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా మరో ముఖ్య అతిథి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, సెమినార్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలకై జిల్లావ్యాప్తంగా నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గంజాయి రవాణా అవుతున్న ప్రధాన దారులను గుర్తించి 11 వెహికల్ సిట్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జరుగుతున్న ర్యాలీకి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు, కళాశాల ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్ వారికి, ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ గారికి, అన్ని శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :