Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం /రావికమతం : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రం రావికమతంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చోడవరం వైయస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు పూర్తి చేసిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కాలేజీలను నిర్మాణాత్మకంగా చేపడుతుంటే వాటిని ఈరోజు కాలరాసేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దానికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల సేకరణ పార్టీ అధిష్టానం నిర్ణయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బుచ్చయ్య పేట జడ్పిటిసి దొండా రాంబాబు పార్టీ అధ్యక్షులు ముక్కా మహాలక్ష్మి నాయుడు ఎంపీపీ పైలరాజు మాజీ కొత్తకోట పిఎసిఎస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు గుమ్ముడి సత్యదేవ్ కన్వీనర్ కంచిపాటి జగన్నాథరావు కంచిపాటి మూర్తి ప్రోటోకాల్ జడ్పిటిసి తలారి ఆదిమూర్తి మాజీ వైస్ ఎంపీపీ గంటా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV