Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : నర్సీపట్నం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన షేక్ గఫూర్, రాష్ట్ర శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సీపట్నంలోని స్పీకర్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐ గఫూర్ స్పీకర్ కు గౌరవ సూచకంగా పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ అంశాలపై కాసేపు చర్చించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని స్పీకర్ ఈ సందర్భంగా సిఐకి సూచించారు.
Admin
Rapid TV