Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్ క్లస్టర్ గేట్ ల ద్వారా వరద నీటిని అధికారులుశుక్రవారం సాయంత్రం నుంచి దిగివకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఈ సత్యనారాయణ దొర మాట్లాడుతూ రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతుందని, రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 458.5 అడుగులకు చేరుకోవడంతో ముందస్తు చర్యలో భాగంగా రెండు క్లస్టర్ గేట్లు ద్వారా సుమారు 80 క్యూసెక్కుల వరద నీటిని సర్పనది పరివాహ ప్రాంతాల్లోకి విడిచిపెడుతున్నట్లుగా తెలిపారు. ఈ ప్రక్రియ శనివారం ఉదయం ఐదున్నర గంటల వరకు కొనసాగుతుందని నదికి ఎగువన ఉన్న గిరిజన గ్రామాలైన ధర్మవరం చిన్న ధర్మవరం చలిసింగం తదితర గ్రామాల ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
Admin
Rapid TV