Tuesday, 28 July 2026 11:37:28 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

డిఆర్డిఏ వెలుగు ఉద్యోగస్తుల ధర్నాకు దాడి రత్నాకర్ మద్దతు

Date : 31 January 2024 07:48 PM Views : 230

Rapid TV - Andhra Pradesh / Anakapally : డీఆర్‌డీఏ వెలుగు ఉద్యోగుల ధర్నాకు దాడి రత్నాకర్‌ సంఫీుభావం... న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు పోరాటం సాగించాలి.. మీ పోరాటానికి మా పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి టీడీపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్‌.. మీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని, మీ పోరాటానికి మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో డీఆర్‌డీఏ వెలుగు సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దీక్షా శిబిరాన్ని బుధవారం రత్నాకర్‌ సందర్శించి సంఫీుభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎవరి హక్కులకు భంగం కలిగినా పోరాడి సాధించుకొనే హక్కు ఉందన్నారు. ఈ హక్కును ఉల్లంఘించే అధికారం ఏ ప్రభుత్వానికిగాని, అధికారులకుగానీ లేదన్నారు. మిమ్మల్ని భయబ్రాంతులను చేయడానికి, మీ పోరాటానికి నీరుగార్చేందుకు మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తామని, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నే ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రోడ్డుపైకి వచ్చి టెంట్‌వేసి ధర్నా చేపడితే తప్ప మీ సమస్యలు పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం, అధికారి స్పందించి మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొనే పరిస్థితులు ఉండవన్నారు. మీ సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం చేస్తున్న పోరాటం ఏ వ్యక్తి మీదో, వైసీపీ పార్టీ మీదో కాదని ఈ ప్రభుత్వంపైనే అని, దీనికి ప్రభుత్వం తప్పక తలొగ్గి మీ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దిగి రావాల్సిందే అన్నారు. మీరు చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు సంఫీుభావం తెలపాల్సిన బాధ్యత ఉందని రత్నాకర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.శ్రీనివాసరావు, వై.బాలరాజు, బి.రామకృష్ణ, ప్రకాష్‌, సాయి రమేష్‌, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :