Rapid TV - Andhra Pradesh / Anakapally : మార్చి 7వ తేదీన అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం పిసిడికాడ వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా స్థలాన్ని విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడవ తేదీన అనకాపల్లిలో జరగనున్న ఆసరా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ఈ సందర్భంగా సభ స్థలాన్ని, సెక్యూరిటీని పూర్తిగా పరిశీలించాలని, సుమారు 50 వేల మంది వరకు ప్రజలు వస్తున్నారని అంచనాతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తమ పోలీస్ సిబ్బంది చేస్తున్న ఏర్పాటుతో పూర్తి సంతృప్తి చెందామని అన్నారు.. ఈ సభకు వచ్చే ప్రజల కోసం నాలుగు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఒక్కొక్క పార్కింగ్ స్థలంలో 250 వరకు వెహికల్స్ పడతాయని అన్నారు. ఈ సభకు వచ్చే వృద్ధులకు మహిళలకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు
Admin
Rapid TV