Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిట్ టీవీ:: *బాలికపై లైంగిక దాడికి పాల్పిడిన కేసులో నిందితుడి బండారు రమణ (32)కి 5 సం., కారాగార శిక్ష మరియు రూ.17,000/- జరిమానా విశాఖపట్నం, పోక్సో కోర్టు శిక్ష విధించిందని జిల్లా ఎస్పీ ఏం. దీపిక ఐపిఎస్ తెలిపారు. బండారు రమణ లారీ క్లీనర్, నాగవరం గ్రామం, మునగపాక మండలం, అనకాపల్లి జిల్లా చెందినవాడు. ఫిబ్రవరి 10 తేదీ 2019 న అదే గ్రామానికి చెందిన మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడడం తో తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సోమవారం జడ్జి శ్రీమతి జీ. ఆనందిని శిక్ష ఖరారు చేశారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆ డబ్బులు అందజేయాలని ఆదేశించారు.
Admin
Rapid TV