Tuesday, 28 July 2026 11:42:11 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ఉగ్ర దాడులు, విపత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:: అనకాపల్లి డిఆర్ఓ వై సత్యనారాయణ రావు

Date : 14 May 2025 08:08 PM Views : 306

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి.. ఉగ్రదాడులు, విపత్తులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ అనకాపల్లి డి.ఆర్.ఓ. వై.సత్యన్నారాయణ రావు అన్నారు. అనకాపల్లి బైపాస్ జక్షన్ లో వున్న గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో బుధవారం ప్ర‌భుత్వ శాఖ‌ల మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యన్నారాయణ రావు జిల్లా ప్రజలకు ఉగ్రదాడులు విపత్తులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన (ఎస్ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్) దళాలు మరియు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖలు, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన (ఎస్ఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్) దళాలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యం అయ్యయ్యాన్నారు. అపార్ట్మెంట్లో బాంబు పేలితే, ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి, సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వారు రెస్క్యూ చేసి హాస్పిటల్ కి చేర్చేదాకా వివిధ రకాల డ్రిల్స్ ని మొదట అధికారులు చూపించడం జరిగిందన్నారు. వినూత్నమైన పరికరాల గురించి వివరించడం జరిగిందని పేర్కొన్నారు. విపత్తుల యాజమాన్య సంస్థ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వహిస్తారని అన్నారు. అన్ని శాఖాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా చూడాలని అన్నారు. అధికారులు కూడా డ్రిల్ గురించి నేర్చుకున్నారన్నారు. తరువాత ఇక్కడున్న పౌరులచేత రెస్క్యూ చేయించడం జరిగిందని తెలిపారు. మాక్ డ్రిల్ పట్ల పిల్లలు, మహిళలు, యువకులు ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ మాక్ డ్రిల్ కార్యక్రమంలో అనకాపల్లి ఇంచార్జి ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాంతి ప్రభ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్ వెంకటరమణ, ఎన్.డి.ఆర్.ఎఫ్. ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్, అగ్ని మపక, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్. డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్. ఎఫ్ దళాలు, గ్రీన్ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ పౌరులు, తదితరులు భాగస్వామ్య మయ్యారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: