Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు అనకాపల్లి ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు కాంగ్రెస్ పార్టీ నేత కట్టుమూరి నూక అప్పారావు మహా జన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి చినఅప్పారావు దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యదర్శి కొల్లి సత్యారావు ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక జిల్లా అధ్యక్షులు పెట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ . అనకాపల్లి మండలంలోని పలు గ్రామాలలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాలలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు మరియు మురికి నీటి కాలువల నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనకాపల్లి మండలంలోని కొత్తూరు గ్రామం లో ప్రధాన రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కొత్తూరు జంక్షన్ లో ప్రజల కొరకు సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో మూలపేట గ్రామం లో అసంపూర్ణంగా నిలిచిపోయిన ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని అసంపూర్ణంగా నిలిచిపోయిన మురికినీటి కాలువలు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని మూలపేట గ్రామంలో తాగునీటి ఇబ్బంది తొలగించడం కోసం అవసరమైన చోట్ల మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని అఖిల పక్షం నేతలు ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంతములలో జన నివాస ప్రాంతములు లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు వలన ప్రజా ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ప్రజలకు అంటువ్యాధులు జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాలలో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను ముఖ్యంగా చిన్నపిల్లలను భయాందోళనకు గురి చేస్తున్నాయని వీటి వలన ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు గ్రామీణ ప్రాంతాలలో పందులు కుక్కలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు
Reporter
Rapid TV