Thursday, 30 July 2026 12:43:49 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అరకులో దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ బంద్

Date : 16 February 2024 09:04 PM Views : 205

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు లో దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ బంద్ ర్యాలీ, మానవహారాలతో కార్మికుల నిరసన అరకులోయ లో శుక్రవారం దేశవ్యాప్త పారిశ్రామిక గ్రామీణ బంద్ జరిగింది. దీనిలో భాగంగా నిరసన, ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి.. దేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక, ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ భారత్ బంద్ లో భాగంగా అరకులోయ లో కార్మికులు భారీ ర్యాలీ, మానవ హారం కార్యక్రమాలు చేపట్టి తమ నిరసన ను తెలిపారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పాలనలో కార్మికులు కర్షకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్టజీవులు కి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ కోట్ల రూపాయలు వారికి రాయితీలు ఇస్తున్నారన్నారు. మోటర్ డ్రైవర్లకు, ఓనర్లకు ఉరి తాడు వంటి 106 (1) సెక్షన్లు మార్పులు చేసి ప్రమాదం జరిగితే డ్రైవర్ కు 10 లక్షలు జరినామా 10 సంవత్సరాలు జైలు శిక్ష వంటి విధంగా చట్టం తీసుకొస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, స్కీం వర్కర్లు కు కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కార్మికులకు, రైతులకు వ్యతిరేకంగా ఉండే బిజెపి కి మద్దతిస్తున్న వైసిపి టిడిపి ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్ మద్దతు తెలియజేస్తూ గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. గిరిజన డిఎస్సి ని తక్షణ మే ప్రకటించాలని, జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి నాగమ్మ, వెంకటలక్ష్మి, గణేష్ వాయుపుత్ర మోటర్ యూనియన్ అధ్యక్షులు రాజయ్య, సహదేవ్, బలోరా లోడింగ్ ఆటో యూనియన్ కార్యదర్శి అర్జున్, చందర్రావు, ఐటిడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజు, జిసిసివర్కర్స్ సబ్బులు యూనియన్ నాయకులు సింహాద్రి, ఐకెపి యూనియన్ నాయకులు రాజ్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జే. భగత్ రాం, తదితరులు పాల్గొన్నారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :