Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంమండలం గోకులపాడు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. విశాఖ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ పామర్రు కు చెందిన క్రాంతి కిరణ్ అనే వ్యక్తి మృతి చెందాడని ఎస్.రాయవరం పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం పై స్థానిక పోలీసులుకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Rapid TV