Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ *శ్రీ ప్రగడ నాగేశ్వరరావు ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో *తొలి అడుగు *అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాంబిల్లి మండలం మురకాడ పంచాయతీ మరియు దిమిలి గ్రామపంచాయతీలలో డోర్ టు డోర్ కార్యక్రమం రాంబిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *శ్రీ లాలం భరత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లు సమస్యలు అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబిల్లి మండల తెలుగు యువత అధ్యక్షులు *ఎరిపల్లి అజయ్ , క్లస్టర్ ఇన్చార్జ్ *సేనాపతి నాగేశ్వరరావు వెంకటరమణ , పప్పల బాబ్జి రుత్తల గిరి బాబు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV