Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ రావికమతం l: మండలంలో ని మత్సవానిపాలెం గ్రామంలో 20 మంది భక్తులు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఆంజనేయ స్వామి మాలలు ధరించారు. ఈ సందర్భంగా వేపా ధర్మ ఫణిఈశ్వరి మాట్లాడుతూ మాలా ధారణ చేసిన భక్తులు తొమ్మిది రోజులు పాటు స్వామివారి కఠిన దీక్షలు పాటిస్తూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ ప్రార్ధన కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలి చెట్ల గణేష్, గురు స్వామి సోమిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Admin
Rapid TV