Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి వుడ్ పేట హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్లో ముందస్తు హోలీ ,రంగోలి సంబరాలను రంగుల మయంగా నిర్వహించారు. కరస్పాండెంట్ శేశెట్టి గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో చిట్టిపొట్టి చిన్నారులంతా ఒకరిపై ఒకరు రంగులు, పూలు చల్లుకుంటూ కేరింతలతో హుషారుగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. భారతదేశంలో పిల్లలు పెద్దలు ఆనందంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటని, శాస్త్రీయ దృక్పథంలో చూసినట్లయితే చలికాలం నుంచి వేసవి కాలానికి కాలం మారే క్రమంలో అనేకములైన మానవాళికి హాని కలిగించే సూక్ష్మజీ వులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రకృతి ప్రసాదిత చెట్ల నుంచి ,పువ్వులు నుంచి సేకరించిన సహజ సిద్ధ రంగులను శరీరానికి పూసుకోవడం వలన ఆ సూక్ష్మజీవులు బారిన పడకుండా కాపాడుకోవచ్చని కరస్పాండెంట్ గిరీష్ కుమార్ తెలియజేశారు. చిట్టి పొట్టి చిన్నారులంతా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత ,సిబ్బంది ,విద్యార్థులు తల్లిదండ్రులు, విశ్రాంత ఏఈ మల్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV