Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు మంత్రి పదవి దక్కడం తో తేదేపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పాయకరావుపేట 4 మండలాలు కోట ఉరట్ల ,ఎస్.రాయవరం ,నక్కపల్లి ,పాయకరావుపేట మండలాల్లో తెదేపా శ్రేణులు ,కూటమి కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ర్యాపిడ్ న్యూస్ ద్వారా పాయకరావుపేటవంగలపూడి అనిత రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 1979 మార్చి24 న పెందుర్తి నియోజకవర్గం ,సబ్బవరం లో జన్మించిన వంగలపూడి అనిత 2009 ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎస్.సి, ఎం.ఏ ,ఎం.ఈ.డి చదువుకున్నారు. తండ్రి : వంగలపూడి అప్పారావు తల్లి. :స్నేహాలత దంపతులకు జన్మించిన సాదారణ జీవనం సాగిస్తున్నారు. అనిత కు ఇద్దరు పిల్లలు అనిత కుమారుడు నిఖిల్ 3 వ సంవత్సరం ఆర్కిటెక్చర్ గా చదువుతున్నాడు. కుమార్తె రేస్మిక విశాఖ లో గత ఏడాది 10 వ తరగతి పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ చదువుకోసం జాయిన్ అయ్యినట్లు సమాచారం. అనితకు ఉపాధ్యాయురాలుగా ప్రభుత్వ ఉద్యోగం లభించింది. పాయకరావుపేట మండలం పాల్తేరు ,వెంకటనగరం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. రాజకీయాలపై మక్కువతో ఉపాధ్యాయ ఉద్యోగం కు రాజీనామా చేసి 2013 లో చంద్రబాబు మీకోసం యాత్రలో టి.డి.పి పార్టీలో చేరారు. ఎస్.సి రీజర్వ్డ్ నియోజకవర్గం అయిన పాయకరావుపేట కు ఎస్.సి కోటాలో 2014 లో ఎమ్మెల్యే సీటు దక్కింది. 2014 ఎన్నికల్లో చెంగల వెంకట్రావు పై గెలుపొందింది. 2019 లో పార్టీలో కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 ఎన్నికల్లో కొవ్వూరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వై.సి.పి అభ్యర్థి తానేటి వనిత పై ఓటమి పాలయ్యారు.అక్కడ ఓటమి పాలయిన అనిత తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట కు ఇంచార్జి గా వచ్చి అధినేత చంద్రబాబు మన్ననలు పొంది రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గా ,పొలిట్ బ్యూరో సభ్యురాలు గా స్థానం దక్కించుకున్నారు.పాయకరావుపేట నియోజకవర్గం లో 2024 లో వై.సి.పి అభ్యర్థి కంబాల జోగులు పై 43 వేల పై చిలుకు మెజార్టీ తో విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.రానున్న రోజుల్లో వంగలపూడి అనిత మరిన్నీ ఉన్నత పడవుకు చేపట్టాలని కోరుకుందాం !
Reporter
Rapid TV