Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: మాజీ ఏం ఎల్ సి మరియు ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ శ్రీ ఎన్ శేష రెడ్డి ఆధ్వర్యంలో అనకాపల్లి లో నూతనముగా ఏర్పాటుచేసిన ఆదిత్య డిగ్రీ కళాశాల గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షులు మరియు డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరై కళాశాలను ప్రారంభించారు. ఈ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తక్కువ ఫీజులకే నాణ్యమైన విద్యను అందిస్తామని ఆదిత్య కళాశాల నిర్వాహకులు తెలిపారు
Admin
Rapid TV