Thursday, 30 July 2026 04:16:49 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

మత్తు పదార్థాల వ్యాపారస్తుల్ని ఉరి తీయాలి: మాజీమంత్రి దాడి వీరభద్రరావు

Date : 23 March 2024 11:34 PM Views : 294

Rapid TV - Andhra Pradesh / Anakapally : లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్ధాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్‌ యజమానుల్ని ఉరితీయాలి - మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనకాపల్లిలో తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.. సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్‌ యజమానుల్ని ఉరితీయాలని, మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను న్యాయస్థానాలు తమ విస్తృత అధికారాలను ఉపయోగించి శిక్షించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భయంకరమైన మత్తు పదార్ధాలను బ్రెజిల్‌ నుంచి విశాఖపట్టణానికి తీసుకొచ్చిన కంటైనర్‌ను ఇంటర్‌పోల్‌ సహాయంతో స్వాధీనం చేసుకున్న సి.బి.ఐ. అధికారులను అభినందిస్తున్నానని చెప్పారు. సి.బి.ఐ. న్యాయమూర్తి సమక్షంలో కొన్ని ప్యాకింగులను తెరిచి వాటిలో కొకైయిన్‌ ఉన్నట్టు గమనించారని అన్నారు. దూర ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన నేరస్థులు విశాఖపట్టణాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తున్నారన్నారు. సి.బి.ఐ. వారు నేర పరిశోధన జాగిలాలను పంపమని కోరినపుడు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఎందుకు వెళ్లారో, సి.బి.ఐ. విచారణలో చొరబడటానికి ఎందుకు ప్రయత్నించారో ప్రశ్నార్ధకంగా ఉందన్నారు. అక్వా కంపెనీ వారు స్వయంగా అక్కడికి హాజరై కంటైయినర్‌ను తెరవకుండా అడ్డుకున్నారంటే వారి వెనుక బలమైన రాజకీయ, పోలీసు యంత్రాంగాలు ఉన్నట్టు అర్ధమవుతోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విశాఖ నుంచి వెళ్లిన మత్తు పదార్ధాలే సమాజాన్ని నాశనం చేస్తున్నాయంటే విశాఖలో కట్టుదిట్టమైన పరిపాలనా వ్యవస్థ లేనట్టుగా రుజువవుతోందని అన్నారు. ఈ లక్ష కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్ధాలు ఎన్నికల్లో అమాయకులైన యువకులకు పంచి ఇచ్చేందుకే అన్న అపోహలు ఉన్నందున ఎన్నికల కమిషన్‌ వారు కూడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :