Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి విశాఖపట్నం : తూర్పు నియోజకవర్గం తోట గరువు ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ కోసం ఉచితంగా కేటాయించింది. ఈ సందర్బంగా పీవీ సింధు అకాడమీ నిర్మాణానికి తల్లిదండ్రులతో కలిసి గురువారం భూమి పూజ చేసారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలు ఒలంపిక్స్ స్థాయికి ఎదిగేలా శిక్షణ అందిస్తామని అన్నారు. బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలో అకాడమీని అందుబాటులోనికి తెస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక నేతలు ఆ ప్రదేశంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ నిరసన తెలుపుతున్నారు.
Admin
Rapid TV