Rapid TV - Andhra Pradesh / Anakapally : అయ్యో! పాపం జగన్ -మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు అనకాపల్లి, జూలై 21 : పదవి పోయిన నాటి నుంచి తేరుకోలేని జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలని పార్లమెంటులో డిమాండ్ చేయమని తన ఎంపీలకు ఆదేశాలు జారీచేశాడు అని తెలుగుదేశం నాయకులు దాడి వీరభద్రరావు తన కార్యాలయంలో ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో అన్నారు. తాను సింహం అని ఒంటరిగానే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్‌కు ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలు జ్ఞాపకం వచ్చాయా అని ప్రశ్నించారు. పార్టీలు ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు తనతో కలిపి రమ్మని ప్రాధేయపడుతున్నాడని అన్నారు. ఈనెల 22 నుంచి జరగబోయే శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి చర్చించే అవకాశం వదులుకుని సమావేశాలకు డుమ్మా కొట్టడానికే 24న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టాడని అన్నారు. రాజభోగాలకు అలవాటుపడిన జగన్ ప్రతిపక్షంలో కూర్చోలేడు. తన పాలన పట్ల విపరీతమైన కక్షతో, అసహ్యంతో ప్రజలు జగన్‌ని అతి దారుణంగా ఓడిస్తే అందుకు కారణాలు తెలుసుకోడానికి బదులు హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నాడని అన్నారు. అతని ఓటమికి పాడి మోసిన తన నలుగురు బంధువులు కూడ ఇవాళ తనని విడిచిపోయే పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ప్రకటనలు చేయకుండా హుందాగా ప్రవర్తించి, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఢల్లీి వీధుల్లో పరిహాసం చేయవద్దని జగన్‌కు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విజ్ఞప్తి చేశారు.
Admin
Rapid TV