Friday, 03 April 2026 09:51:19 AM
# మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక # గ్రామీణ ప్రాంతాల సమస్యలపై దృష్టి సారించాలి అఖిలపక్ష నేతల విజ్ఞప్తి # రైతులు తమ పంటను డైరెక్ట్ గా (ఎఫ్ పి ఓ) అమ్ముకునే విధానం ద్వారా రైతులకు మేలు: జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ # పాయకరావుపేట నుండే ప్రక్షాళన చేస్తా # ఎమ్మెల్యే కొణతాల అనకాపల్లిలో సుడిగాలి పర్యటన # అవసరమైతే సొంత నిధులు ఇస్తా జల్లూరు బ్రిడ్జి వెంటనే పూర్తి చేయండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ # పాండురంగ స్వామి ని దర్శించుకున్న హోంమంత్రి అనిత

అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు

Date : 17 May 2025 07:21 PM Views : 385

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు అనకాపల్లి జిల్లా పట్టణంలో లోక వారి వీధిలో నివాసం ఉంటున్న కొల్లు లలిత భర్త బీసెట్టి హరీష్ చిన్న కుమార్తె రోహిత 14వ తేదీన కనబడటం లేదని అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వెంటనే అనకాపల్లి జిల్లా పోలీసులు అప్రమత్తమై పాప కోసం ఆరు బృందాలుగా ఏర్పడి పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ చర్యలలో భాగంగా పాపని నివాసం ఉంటున్న ఇంటిని చుట్టుపక్కల మరియు అనకాపల్లిలో ప్రధాన సెంటర్లో సీసీ కెమెరాలను విస్తృతంగా తనిఖీలు చెయ్యగా ఓ మహిళ బాలికను అనకాపల్లి పెరుగు బజార్ సెంటర్లోని ఆర్టీసీ బస్సులో తీసుకొని వెళుతుందని గమనించారు దీనిని క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులు అప్రమత్తమై నిందితురాలు టోటోని లక్ష్మీ గా గుర్తించారు ఈ నిందితురాలు గాజువాకలో నివాసం ఉంటున్నట్టు తనిఖీల్లో బయటపడింది పోలీసులు అనకాపల్లిలో గాలిస్తుండగా నిందితురాలు లక్ష్మీ ఆమె భర్త అప్పలస్వామి బొలెరో వాహనంలో బోనాల దేవి అనే వ్యక్తిని కలవడానికి అనకాపల్లి వస్తుండగా జలగల మధు దగ్గర అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో శనివారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితురాలు లక్ష్మీ ఆమె భర్త అప్పలస్వామి ఈ సంఘటనకి తామే కారణమని అంగీకరించారని పేర్కొన్నారు గతంలో ఈమెపై కొన్ని కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఈ పాపను పట్టుకోవడంలో గాజువాక పోలీసులు అనకాపల్లి పోలీసులు శ్రద్ధ చూపారని పేర్కొన్నారు అనంతరం పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు అలాగే తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో తమ పిల్లలు ఆడుకునే సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కేసును చేదించిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు నగదు బహుమతి అందజేశారు

Sanjeev anakapalli

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :