Rapid TV - Andhra Pradesh / Anakapally : *కర్రివాని పాలెం లో రైతు పూజోత్సవం* ఎస్.రాయవరం : ఏరువాక పౌర్ణమ సందర్భంగా జె.డి ఫౌండేషన్ ,తేజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కర్రివానిపాలెం రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దూలపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహారం పండించే రైతును గౌరవించే ఉద్దేశ్యం తో జె.డి ఫౌండేషన్ రైతుల ను సన్మానించే కార్యక్రమం ను రూపు దిద్దారని పేర్కొన్నారు. దీనిలో భాగంగా కర్రి వాని పాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించామన్నారు. కర్రి వాని పాలెం లో పోతు గోవిందరావు తో పాటు మరో 11 మంది రైతులకు పంచె ,టవలు ,స్వీట్ బాక్స్ ఇచ్చి పూలమాల తో సత్కరించడం జరిగింది.ముందుగా తేజా చారిటీ సభ్యులు పొలినాటి నానాజీ మాట్లాడుతూ ఎరువులు ,పురుగుల మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులు అడుగులు ముందుకు వేయాలని సూచించారు. అనంతరం బి.వి.వి.సత్యనారాయణ ,అక్కిరెడ్డి నాగేశ్వరరావు ,అప్పలరాజు లు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మా చారిటీ పనిచేస్తుందన్నారు.రైతులకు జె.డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా చారిటీ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందజేయడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు. అంతకుముందు 12 మంది ఉత్తమ రైతులకు ప్రశంసా పత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పోతు గోవిందరావు ,పినపాత్రుని వెంకటరమణ ,వీరవెంకట సత్యనారాయణ ,పోతు అచ్చియ్య దొర, మోహన రావు ,అప్పారావు ,మోకిన మహేశ్వర రావు ,పోతు రాము , ,గొర్లి రాము ,శ్రీను ,పులి ప్రసాద్ ,శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.
Admin
Rapid TV