Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్, 2 వ తేదీన నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని, ప్రజలు గమనించాలని కోరారు.
Admin
Rapid TV