Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు పాయకరావుపేట రాపిడ్ టీవీ ::, జులై 26 : జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలారాజు ఆధ్వర్యంలో సంఘం కమిటీ సభ్యులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార మంత్రివర్యులు అచ్చన్న నాయుడు, రాష్ట్ర మత్స్యకార కమిషనర్ డోలా శంకర్, మత్స్యకార ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తదితరులను కలిశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలోని మత్స్యకారుల యొక్క ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా రామాపురం గ్రామంలో మత్స్యకారులకు గత ప్రభుత్వం లో పోలీస్ వారు పెట్టిన 17 ఎఫ్ ఐ ఆర్ లపై ఎంక్వైరీ వేసి వారికి న్యాయం చేయాలని, వేట నిషేధ సమయంలో వేట నిషేధ భృతి వెంటనే అందచేయాలని, సముద్ర తీర ప్రాంతాలలో కంపెనీల వల్ల వదులుతున్న వ్యర్ధాలు వల్ల నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకోవాలని, మత్స్యకారుల అభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పెద్దలకు విన్నవించుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న క్యాబినెట్లో జీవో 217ను రద్దు పరిచినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మత్స్యశాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చన్న నాయుడు గారికి జాతీయ మత్యకారుల సంఘం రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు, రాష్ట్ర జనరల్ సెక్రటరీస్ ఒరుపుల జయశంకర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏకాక్షరి, అనకాపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మైలపల్లి జగ్గారావు, మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
Reporter
Rapid TV