Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో ఎస్జిటి టీచర్లనే హెచ్ఎంలు గా నియమించాలి! అనకాపల్లి ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 19, 20, 21 లలో పాఠశాలల పునర్నిర్మాణం అనే పేరుతో తొమ్మిది రకాల పాఠశాలలుగా వాటిని ప్రభుత్వం విభజించిందని యుటిఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న స్కూల్స్ ని తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించడం వలన తల్లిదండ్రులు విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ తొమ్మిది రకాల పాఠశాలలకు తెలుగు పేరు పెట్టలేకపోవడం శోచనీయం అని ఆయన వాపోయారు. ఫౌండేషన్ స్కూల్స్ లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 గాను, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లో 1:20 గాను, హై స్కూల్స్ లో విలీనమైన ప్రైమరీ స్కూల్స్ లో 1:10 గాను నిర్ణయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులు చదువుతున్న ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:20 గా ఉండాలి అని ఆయన డిమాండ్ చేశారు. మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ లనునియమించడం సరికాదన్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఎస్ జి టి టీచర్లనే హెచ్ఎం లు గా నియమించాలని డిమాండ్ చేశారు.
Reporter
Rapid TV