Rapid TV - Andhra Pradesh / Anakapally : యలమంచిలి :సోమలింగపాలెంలో విశాఖ డైరీ నూతన పాలకవర్గం ఏకగ్రీవం కాపు, గవర సామాజిక వర్గాల నుంచి ముగ్గురికి ఐదేళ్ల పాటు చైర్మన్ బాధ్యతలు ఎలమంచిలి:నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని సోమలింగపాలెం గ్రామంలో విశాఖ డైరీ నూతన పాలకవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు కర్రి శివ, కర్రి ఝాన్సీ, యల్లపు గోపి, వేగి ఆదినారాయణ, కర్రీ వరబాబు, యల్లపు పరమేశ్వరరావు, కర్రీ విశ్వేశ్వరరావు, ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐదేళ్ల కాలానికి ముగ్గురు సభ్యులను రొటేషన్ పద్ధతిలో చైర్మన్ లుగా వ్యవహరించేలా గ్రామ పెద్దలు నిర్ణయించారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ కాపు, గవర సామాజిక వర్గాల నుంచి ముగ్గురికి అవకాశం కల్పించామని కర్రి శివ తెలిపారు. విశాఖ డైరీ ద్వారా పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర, బోనస్ అందేలా నూతన పాలకవర్గం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, పాల సేకరణ కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV