Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : స్కూటీ డిక్కీలో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు కేజీల గంజాయిని గొలుగొండ పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గురువారం గొలుగొండ ఎస్సై పి రామారావు సిబ్బందితో కలిసి మండలంలోని చిట్టెంపాడు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చింతపల్లి నుండి మర్రిపాలెం మీదుగా వస్తున్న ఒక స్కూటీని ఆపి తనిఖీ చేయగా స్కూటీ డిక్కీలో రెండు కేజీల గంజాయి పట్టుబడిందని గొలుగొండ ఎస్సై రామారావు తెలిపారు. స్కూటీ పై ప్రయాణిస్తున్న చింతపల్లి మండలం కట్టుబంధ గ్రామానికి చెందిన తాంబేలు యాకోబు, తాంబేలు లక్ష్మి లను అరెస్టు చేసామన్నారు. ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల నిల్వ, రవాణా, విక్రయం చేసినా, అటువంటి వారికి సహకరించినా, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Reporter
Rapid TV