Sunday, 13 September 2026 10:45:52 PM
# కొత్తకోట లో శాకంబరి అలంకారం లో దుర్గమ్మ # మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక

అనకాపల్లి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు దాడులు... కేసులు నమోదు

Date : 30 July 2024 12:45 PM Views : 216

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం. దీపిక ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది జూలై 29 న అనకాపల్లి జిల్లాలో పలు ప్రాంతాలలో మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేశారు. ❇️నాతవరం మండలం, తాండవ జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వలసంపేట వైపు నుండి తాండవ వైపు నడుచుకుని వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి, తప్పించుకునే క్రమంలో పట్టుబడ్డారు. నిందితుల వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్ ను తనిఖీ చేయగా 2 కేజీల గంజాయిని, 3 మొబైల్ ఫోన్లను మధ్యవర్తులు సమక్షంలో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ❇️బహిరంగప్రదేశల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 61 కేసులు నమోదు చేశారు. ❇️హెల్మెట్ రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 367 కేసులు నమోదు చేశారు. ❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందిపై కేసులు నమోదు చేశారు. ❇️ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 576 కేసులు నమోదు చేసి, ఈ-చలానా గా రూ.2,00,835/- లు విధించారు. ❇️జిల్లా పోలీసులు, సెబ్ అధికారులు దాడి చేసి, 7 కేసులు నమోదు చేసి, 4 గురు నిందితులను అదుపులోనికి తీసుకుని, 6 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని, 1,960 లీటర్ల బెల్లం పిలుపును ధ్వంసం చేసిన పోలీసులు. ❇️జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్., గారు పోలీసు అధికారులు అసాంఘిక కార్యకలాపాల ను నియంత్రించాలని, ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ❇️మాదక ద్రవ్యాల నియంత్రణకు, నూతనంగా అమలవుతున్న మూడు చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక, ఐపిఎస్ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టి, కొత్త చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :