Rapid TV - Andhra Pradesh / Anakapally : 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి/అచ్యుతాపురం, న్యూస్ : శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ 3 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. శుక్రవారం ఆలయ అర్చకులచే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సాంప్రదాయబద్ధంగా మాలాధారణ కార్యక్రమం పాల్గొని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి వారికి లడ్డు ప్రసాదంలో ఎటువంటి అపచారం జరగలేదని అన్నారు. ఆగమశాస్త్రం ద్వారా ప్రాయశ్చిత్త దీక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం జరిగిందని, నియోజకవర్గంలో ఈ మూడు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరుగుతుందని తెలిపారు. టీటీడీ ద్వారా మా నియోజకవర్గానికి ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని మాజీ టీటీడీ చైర్మన్ పప్పుల చలపతిరావు, అలాగే మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు కూడా టీటీడీ బోర్డు మెంబర్ గా చేయడం వల్ల నియోజకవర్గానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ జడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాస రావు, బైరపూడి రామదాసు, యలమంచిలి పట్టణ టిడిపి, జనసేన బీజేపీ పార్టీ అధ్యక్షులు బొద్దపు శ్రీనివాసరావు, గొర్లె నానాజీ, నక్క శివశంకర్, రూరల్ అధ్యక్షులు అన్నం బాబ్జి, కొటారు సాంబ, వసంతవాడ దిన్ బాబు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజాన శేషు, కర్ణం రవి, మోటూరు శ్రీవాణి, కర్రి ఝాన్సీ, జై రామ్, పిట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV