Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ ఎలమంచిలి:: వైసీపీకి భారీ షాక్ : వైసీపీ నుంచి జనసేనలో భారీ చేరికలు :మాజీ ఎంపీటీసీ, మాజీ పాల సొసైటి అధ్యక్షుడు, ఇద్దరి పాల సొసైటి డైరక్టర్లు, వార్డు మెంబర్ చేరిక ఎలమంచిలి మండలంలో వైసీపీ భారీ షాక్ తగిలింది. పద్మనాభరాజు పేట, బయ్యవరం గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ బంధం రామకృష్ణ, విశాఖ డెయిరీ పాల సొసైటి మాజీ అధ్యక్షుడు, బయ్యవరం గ్రామ వైసీపీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ భర్త అయిన కరిపిరెడ్డి జోగారావు, బయ్యవరం వార్డు మెంబర్ ముక్కుర్తి అప్పలనాయుడు, వైసీపీ సచివాలయ కన్వీనర్ చంద్రగిరి నాని, విశాఖ డెయిరీ పాల సొసైటి డైరక్టర్లు జెర్రిపోతుల రమణ, మొగిలి నరసయ్య బయ్యవరం గ్రామ వైసీపీ కార్యదర్శి నక్కన అయ్యప్పస్వామి తో పాటు సుమారు ఎనభై మంది వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా ముందుగా పీఎన్ఆర్ పేట నుంచి ఎలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం వరకు భైకులపై ర్యాలీగా వెళ్లారు. అనంతరం వీరంతా వైస్ ఎంపీపీ రాజాన శేషు, జనసేన మండల అధ్యక్షుడు అన్నం బాబూజీ ఆధ్వర్యంలో పీఎన్ఆర్ పేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శానా నానాజీ, బయ్యవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు కంబాల భాస్కరరావు సమక్షంలో జనసేన లో చేరారు. వైసీపీ నుంచి వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జి సుందరపు సతీష్ కుమార్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం సోమునాయుడు, జనసేన మండల కోశాధికారి డి భగవాన్, బయ్యవరం జనసేన అధ్యక్షుడు ఎడ్ల నానాజీ, దాసరి గోవింద్, మొగ్గ అప్పారావు, చంద్రగిరి శ్రీను, జెర్రిపోతుల రామారావు, హనుమంతు నాగేష్, మొల్లి అప్పారావు, ఎడ్ల కోటేశ్వరరావు, మొగిలి దుర్గారావు, రాయవరపు నరసింగరావు, బంధం బాలు, కోడూరి శ్యామ్, కొయ్య అప్పారావు, యండుమూరి నాని, కలిగట్ల శ్రీను, పప్పల చిరంజీవి, చంద్రగిరి సతీష్, హనుమంతు రాజేష్, పులి సాయి, కర్రి లోకేష్, కర్రి వెంకటేష్, సముద్రాల కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV