Rapid TV - Andhra Pradesh / Anakapally : రేపిడ్ టివి చోడవరం/ రావికమతం: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఉద్యమం చేస్తున్న మత్స్యకారులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలను ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వజ్రపు సత్యవతి అన్నారు. బుధవారం మండల కేంద్రం నలుగురు కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మందుల పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు మత్స్యకారులు ఇబ్బంది పడడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం ఏర్పడుతుందని, ఇప్పటికే ఇటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో అచ్యుతాపురం, తాడి, తానాం తదితర ప్రాంతాల పర్యావరణానికి, తీవ్ర నష్టం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమాన్ని ఆపాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యం. అప్పలరాజును ప్రభుత్వం నిర్బంధం చేయడం మిగిలిన ఉద్యమకారులపై కేసులు పెట్టడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
Admin
Rapid TV