Rapid TV - Andhra Pradesh / Anakapally : నర్సీపట్నం, RAPID TV : పెద్ద బొడ్డేపల్లిలో ఒక వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ చేసిన ఇద్దరిని పట్టణ సీఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టణ సీఐ జి గోవిందరావు అందించిన వివరాల ప్రకారం, పెద్ద బొడ్డేపల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గరలో నివాసముంటున్న ఉద్దండం దేవుడులమ్మ అనే 60 సంవత్సరాల వృద్ధురాలు సోమవారం ఉదయం తన ఇంటి పెరటిలో ముఖం కడుక్కుంటున్న సమయంలో ఒక మహిళ వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడు లాగుకొని వెళ్తుండగా, ఆమెను ఆపే క్రమంలో వృద్ధురాలు క్రిందపడి తలకు గాయం తగిలిందని తెలిపారు. చోరీకి వచ్చిన మహిళ పుస్తెలతాడు పట్టుకొని పారిపోయిందన్నారు. వృద్ధురాలని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వృద్ధురాలి ఫిర్యాదు పై చైన్ స్నాచింగ్, దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మంగళవారం ఈ కేసులో పెద్ద బొడ్డేపల్లి కి చెందిన గండి దుర్గాభవాని (26), నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కరరావు (31) లను స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో అరెస్టు చేసి వారి వద్ద నుండి 28.530 గ్రాముల పుస్తెలతాడు స్వాధీనం చేసుకొని , ముద్దాయిలను జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని సిఐ గోవిందరావు తెలిపారు.
Reporter
Rapid TV