Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : కాశ్మీర్ లోని పహాల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ అంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఎ పి యు డబ్ల్యూ జె )రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మాడుగుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రావికమతం మండల కేంద్రంలో శనివారం ఉదయం శాంతి, సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమై నాలుగు రోడ్ల కూడలి వద్ద మాన వహరంగా ఏర్పడి ఉగ్రవాదులకు సహకరిస్తున్న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అమరులైన యాత్రికుల ఆత్మ శాంతించాలని ప్రార్థన చేశారు. పాత్రి కేయులు కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని దానికి సంపూర్ణ మద్దతు అన్ని వర్గాల ప్రజలు తరపున ఉంటుందని అన్నారు, వైఎస్ఆర్సిపి నాయకులు కంచిపాటి జగన్నాథరావు మాట్లాడుతూ ఉగ్రవాదులపైన,పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని అభం శుభం తెలియని యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తున్నామని భారత ప్రభుత్వం తీసుకుననే ఏ చర్యలకైనా మేమంతా కట్టుబడి ఉంటామని అన్నారు అనంతరం తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు రావికమతం ఎస్ఐ వారి సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం ఎమ్మార్వో కార్యాలయాల సిబ్బంది, సిఐటియు వజ్రపు సత్యవతి ఆశా కార్యకర్తలు సర్పంచ్ మోది నాయుడు ఎంపీటీసీ సూర్యనారాయణ వేపాడ నాగేశ్వరరావు మిలిటరీ నాయుడు పులిగాయల సత్యనారాయణ తట్టబంద సర్పంచ్ రమణ బైక్ నాయుడు పాల్గొన్నారు ఆనంతరం తాసిల్దార్ వెంకటేశ్వరరావుకు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఇల్లపు సత్యనారాయణ ఎద్దు సత్యనారాయణ శ్రీను బుల్లిబాబు వరహాలు సాంబయ్య లోవ రాజు రవిప్రసాద్ నగేష్ బుచ్చయ్యపేట విలేకరులు వేణు, రామలింగేశ్వరరావు, జ్యోతి వీలేకరి తదితరులు వినతిపత్రం అందజేశారు
Admin
Rapid TV